WNP: చిన్నంబావి మండలం మియాపూర్ గ్రామ సమీపంలోని సప్తగిరి రైస్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 27 మద్యం కాటన్ లను ఎస్ఐ నాగరాజు, సిబ్బంది తో కలిసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నాగరాజు మాట్లాడుతూ..విశ్వసనీయ సమాచారం మేరకు సప్తగిరి రైస్ మిల్లు ను తనిఖీ చేసి రూ.2,56,608/- విలువ గల మద్యాన్ని సీజ్ చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై నాగరాజు తెలిపారు.