TPT: శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్గా ఎన్నికైన రంగినేని చెంచయ్య నాయుడు శనివారం ఉదయం 10 గంటలకు జరిగే ప్రమాణ స్వీకార కార్య క్రమానికి రేణిగుంట టీడీపీ నాయకులను సోమవారం స్వయంగా రేణిగుంట వచ్చి ఆహ్వానించారు. మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చెంచయ్య నాయుడుకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.