MBNR: కౌకుంట్ల మండలంలోని పేరూరు గ్రామానికి శృతి అరవింద్ రెడ్డి, వెంకంపల్లికి సంప్రీతి రామ్ రెడ్డి సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ బలపరిచిన వీరిని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సన్మానించి అభినందించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామ సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పనుల్లో శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే సూచించారు.