WGL: వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ శివారులోని జామొయిల్ తోటలో అనుమతి లేకుండా 8 తాటి చెట్లను నరికివేశారని సమాచారం అందడంతో ఎక్సైజ్ సీఐ స్వరూప ఇవాళ సిబ్బందితో కలిసి పరిశీలించారు. చెట్లను అనుమతి లేకుండా నరికివేయడం చట్టవిరుద్ధమని, ఇందులో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేసి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ స్వరూప తెలిపారు.