BHNG: వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ కవి రెబ్బ మల్లికార్జున్ “తెలంగాణ సాహితీ సంస్థ” జిల్లా కోశాధికారిగా ఎన్నికయ్యారు. సంస్థ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఆనందచారి సమక్షంలో జిల్లా కవులందరరూ సమావేశమై ఆయన ఎన్నికను ఏకగ్రీవం చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, మధుమోహన్, ఉప్పలయ్య, వెంకన్న, నాగభూషణం, ముత్యాలు పాల్గొన్నారు.