BHNG: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్ పూర్, మోహన్ నగర్, హైదర్ పూర్, బీమనపల్లి గ్రామాల్లో సోమవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్ధులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.