అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబుళవారిపల్లి మండలం, బొమ్మ వరం గ్రామ ప్రజలు సోమవారం రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉమ్మల రాజు సుబ్బరాజు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద జరిగిన ఈ నిరసనలో ‘రాయచోటి వద్దు రాజంపేట ముద్దు’ అని నినాదాలు చేశారు.