AKP: మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ ఆపాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఎలమంచిలిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం బాలాజీ మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ కారణంగా పేద విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నడపాలన్నారు.