GDWL: ఇటిక్యాల, ఎర్రవల్లి, అలంపూర్, ఉండవెల్లి మండలాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం మొత్తం 700 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, విధుల కోసం 700 పీవోలు, 859 ఓపీవోలు సహా మొత్తం 1,559 మంది సిబ్బందిని రెండో ర్యాండమైజేషన్ ద్వారా నియమించారు.