SRPT: నడిగూడెం మండలంలోని సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల ఖర్చును ₹1.50 లక్షలకు మించకుండా చూసుకోవాలని ఎంపీడీవో మాల్సుర్ తెలిపారు. ఆదివారం రైతు వేదికలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు శాంతియుతంగా, ప్రశాంతంగా జరిగేందుకు అభ్యర్థులందరూ సహకరించాలని కోరారు. ఎన్నికల నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.