KMM: కూసుమంచి మండలం, గైగోళ్లపల్లి గ్రామంలోని నవ్య గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐ.కె.పిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో లారీకి బస్తాలు ఎత్తుతుండగా ప్రమాదవశాత్తు కూలి బొడ్డు నవీన్ అనే హమాలీ కార్మికుడికి కుడికాలు విరగగా మరో కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన తోటి హమాలి కార్మికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.