భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ ప్రతీకా రావల్‌కు ఢిల్లీ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. తాజాగా ఆమెకు రూ.1.5 కోట్ల రివార్డ్ అందించింది. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. మహిళల వన్డే ప్రపంచకప్‌లో గాయం కారణంగా సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు ఆమె దూరమైన విషయం తెలిసిందే. ICC ఛైర్మన్ జైషా చొరవతో ప్రతికా సైతం విన్నర్ మెడల్‌ను పొందింది.