HYD: మెట్రో ప్రయాణికులకు కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. టికెట్ కొనుగోలు చేసిన తర్వాత, స్టేషన్ ప్రాంగణంలో రెండు గంటల కంటే ఎక్కువ గడిపితే అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు. ఫుడ్ కోర్టులు, షాపింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటే, ప్రయాణికులపై అదనంగా రూ. 15 నుంచి రూ. 50 వరకు భారం పడుతుందని అంచనా. అయితే మెట్రో సంస్థ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.