బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న ‘అఖండ 2’ చిత్రం పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా కొత్త విడుదల తేదీని నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘అఖండ 2’ క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.