విశాఖ వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగారు. దీంతో సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో డికాక్ (106), బవుమా (48) ధాటిగా ఆడటంతో భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే, మిడిల్ ఓవర్లలో ప్రసిద్ధ్ కృష్ణ(4 వికెట్లు), కుల్దీప్(4 వికెట్లు) అద్భుత బౌలింగ్ చేసి సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు. వన్డే సిరీస్ కైవసం చేసుకోవడానికి భారత్ 271 పరుగులు చేయాలి.