GNTR: కాకుమాను పోలీస్ స్టేషన్లో వృద్ధుడు మిస్సింగ్‌పై శనివారం కేసు నమోదైంది. పోలీసులు వివరాల మేరకు.. ‘మండలంలోని బీకేపాలెంకు చెందిన వృద్ధుడు ఇనగంటి ఏసోబుకు మతిస్థిమితం లేదు, మాటలు రావు. గత నెల 28వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు’. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.