KMM: మూల పోచారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి (డీడీ) ఎన్. విజయలక్ష్మి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం, రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఉద్దీపనం’ అమలు తీరును ప్రత్యేకంగా గమనించారు. పదో తరగతి విద్యార్థులను దత్తత తీసుకొని, 100 శాతం ఫలితాల సాధన కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.