TG: పోరాటాల పౌరుషం ఉన్న గడ్డ నల్గొండ జిల్లా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే సన్నబియ్యం ఇస్తోందని వెల్లడించారు.