సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా అరుదైన మైలురాయి సాధించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో(53) సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో 2000 పరుగులు సాధించిన 5వ ప్లేయర్‌గా నిలిచాడు. 40 ఇన్నింగ్స్‌లతో హషీమ్ ఆమ్లా తొలి స్థానంలో ఉన్నాడు. అలాగే, ఈ ఘనత సాధించిన ఓల్డెస్ట్ సౌతాఫ్రికా ప్లేయర్(35y 203d)గా బావుమా మరో రికార్డ్ నమోదు చేశాడు.