MNCL: నస్పూర్లో శనివారం ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం నాయకులు బింగి సదానందం, జె.నర్సింగ్, గుమ్మడి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని దేశ పౌర సమాజానికి అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.