ADB:బోథ్ మేజిస్ట్రేట్ కుంభ సందీప్ అధ్యక్షతన ఈరోజు స్థానిక కోర్టులో కో ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు.21 డిసెంబర్ న జరగబోయే నేషనల్ లోక్ అదాలత్ పై చర్చించారు.కేసుల పరిష్కారం, ప్రజలకు న్యాయం సులభంగా చేరుకునే విధానాల పై పలు సూచనలు చేశారు.లీగల్ అవేర్నెస్ కలిగించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్లుతో పాటు పోలీసు శాఖ, ఫారెస్ట్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.