TPT: ద్విత్వ తుఫాను కారణంగా వజ్రవారిపాలెం గ్రామం తీవ్రంగా దెబ్బతింది. భారీ వర్షాల వల్ల గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా నీట మునిగింది, దీంతో రాకపోకలు స్తంభించాయి. ఉదయం పూట బడికి వెళ్లే విద్యార్థులు, పనులకు వెళ్లే ఉద్యోగులు మరియు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే నీటిని తొలగించి, రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.