కామారెడ్డిలోని తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని (T-Hub) శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. విద్య, జిల్లా NCD ప్రోగ్రాం అధికారి డా. శిరీషతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన రక్త పరీక్షల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. యంత్రాల పనితీరు, నమోదు చేసే రికార్డు, రిజిస్టర్లను పరిశీలించారు.