భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై అమెరికా భారీ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో US-IND మధ్య వాణిజ్య చర్చలు మళ్లీ పట్టాలెక్కాయి. ఈ చర్చల కోసం అమెరికా బృందం భారత్‌లో పర్యటించనుంది. ఇరు దేశాల ప్రతినిధులు కీలక అంశాలపై చర్చించనున్నారు.