మహారాష్ట్రలోని పూణెలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. న్యాయసహాయం చేస్తానని నమ్మబలికిన ఓ మహిళ, తనకు మత్తుమందు ఇచ్చి మూడుసార్లు అత్యాచారం చేసిందని 37 ఏళ్ల వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్యాచార ఘటన తర్వాత.. రూ.2 లక్షలు ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేసిందని పేర్కొన్నాడు. లేదంటే, తనపై అత్యాచారం కేసు వేస్తానని బెదిరించిందని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.