నిద్రలో కలలు రావడం సహజం. చాలా వరకు ఇవి గాఢమైన నిద్రలో వస్తుంటాయి. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, స్కిజోఫ్రెనియా లేదా బోపోలార్ డిజార్డర్ వంటి రుగ్మతల బారిన పడినప్పుడు భయానక లేదా పీడకలలు వచ్చే అవకాశం ఉంది. ఎవరో వెంటాడుతున్నట్లు, సూసైడ్ చేసుకున్నట్లు, దెయ్యాలు తరుముతున్నట్లు, ఆత్మీయులు చనిపోయినట్లు వస్తాయి. అలాంటివారు సమయానికి నిద్రపోవాలి. యోగా, మెడిటేషన్ చేయాలి.