విమాన టికెట్ ధరల నియంత్రణపై కేంద్ర విమానయాన శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. కరోనా సమయంలో మాదిరిగానే ఇప్పుడూ ధరలు నియంత్రించాలని నిర్ణయించింది. కాసేపట్లో వివిధ రూట్లలో విమాన ధరలను విమానయాన శాఖ వెల్లడించనుంది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో డీజీసీఏ అధికారులు, పలు విమానయాన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.