బాలీవుడ్ స్టార్ అలియా భట్ ముంబై బాంద్రా వెస్ట్‌లో 6 అంతస్తుల విలాసవంతమైన భవంతిని నిర్మించారు. ఈ కొత్త ఇంటి విలువ సుమారు ₹250 కోట్లు ఉంటుందని సమాచారం. ఇటీవలే ఇందులోకి గృహ ప్రవేశం చేసిన అలియా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. ఆ ఫోటోలను తాజాగా ఇన్‌స్టాలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. నవంబర్ 6న రాహా మూడో పుట్టినరోజు వేడుకలు కూడా ఈ కొత్త ఇంట్లోనే జరిగినట్లు తెలుస్తోంది.