TG: యాసంగి సీజన్‌కు సంబంధించి రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి యూరియా కొరత లేకుండా, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు సాగు విస్తీర్ణం ప్రకారమే.. యూరియా పంపిణీ చేయనుంది. ఇందుకోసం రైతుల పట్టాదారు పాస్‌బుక్ నుంచి వివరాలు సేకరించి.. ఎంత యూరియా అవసరమో లెక్కలు తేల్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.