HNK: అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో MLA పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ మేధావులలో ఒకరైన అంబేద్కర్ మన దేశానికి చెందినవాడు కావడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని పేర్కొన్నారు.