CTR: పూతలపట్టు మండలం రంగంపేట సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు-తిరుపతి హైవేపై రాత్రి 10గంటల సమయంలో ఓ బైక్ అదుపుతప్పి కింద పడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.