VZM: తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లాకి చెందిన నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు దత్తిరాజేరు మండలం కొరప కొత్తవలసకు చెందిన వంగర రామక్రిష్ణ (51), మార్పిన అప్పలనాయుడు (33), మరాడ రాము (50), గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన చంద్ర రావు(35)గా గుర్తించారు.