TG: ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ కలకలం రేపింది. వెంటనే ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేయగా దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. ప్యాసింజర్లు లగేజ్‌ను ఎయిర్ పోర్టు సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ ప్లైట్‌లో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.