జయరామ్ తేజ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సినిమా హింట్..?. ఈ మూవీని మైత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. చందూ బిజుగ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని మేకర్స్ తెలిపారు.
జయరామ్ తేజ(Jayaram Teja) హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సినిమా హింట్..?(Hint..?). ఈ మూవీని మైత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. చందూ బిజుగ(Director Chandu Bijuga) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని మేకర్స్ తెలిపారు. మైత్రి రెడ్డి, రిజ్వాన్ అహ్మద్ సంయుక్తంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పోస్టర్ లాంచ్(Poster Launch) ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి నవ్యాంధ్ర ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు ఎస్విఎన్ రావు, హీరో కృష్ణ సాయి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
నవ్యాంధ్ర ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు ఎస్వీఎన్ రావు మాట్లాడుతూ.. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్(Suspence Thriller) కథానేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. హీరో కృష్ణసాయి మాట్లాడుతూ..ఈ మూవీ నిర్మాతలకు మంచి విజయాన్ని అందించి, టెక్నిషియన్స్ కు మంచి పేరు తీసుకొస్తుందన్నారు.
దర్శకుడు చందూ బిజుగ(Director Chandu Bijuga) మాట్లాడుతూ..తనకు 15 ఏళ్లకు పైగా టీవీ ఇండస్ట్రీలో దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ఉందన్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా తానేంటో ప్రూవ్ చేసుకుంటానన్నారు. హీరో జయరామ్ తేజ(Jayaram Teja) మాట్లాడుతూ సీరియల్ నటుడిగా ఉన్న తనను హీరోగా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. నిర్మాత మైత్రి రెడ్డి మాట్లాడుతూ హింట్? సినిమా అద్భుత విజయం సాధిస్తుందన్నారు.