ASR: పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి పాల్గొని, మాట్లాడారు. విద్యార్థులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వైఫల్యాలు ఎదురైతే, వాటిని విజయంగా మార్చుకోవాలన్నారు.