BDK: చుంచుపల్లి ధన్బాద్ ఏరియాలోని పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను టూటౌన్ ఎస్సై కిషోర్ నేతృత్వంలోని బృందం పట్టుకుందని సీఐ ప్రతాప్ తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం వెల్లడించారు. కొందరు పారిపోగా, అదుపులోకి తీసుకున్న నలుగురి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, రూ. 2,670 నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.