RR: బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కోసం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సాయి ఈశ్వర్ మృతి బాధాకరమని తెలంగాణ జాగృతి ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ముస్తఫా అన్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఈ ఆత్మ బలిదానంతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో చలనం రావాలన్నారు. సాయి ఈశ్వర్ కుటుంబానికి ప్రభుత్వాలు తక్షణ సాయం అందించాలన్నారు.