J.N: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అద్భుతమైన శక్తికి, సృజనాత్మకతకు, ధృడ సంకల్పానికి దివ్యాంగులు ప్రతీక అని, అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుతున్నారని అన్నారు.