TG: పోలీసుల ఆరోగ్య భద్రతపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆరోగ్య సేవలను నిమ్స్కే పరమితం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందకపోవడంతో పోలీస్ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని మండిపడ్డారు. వెంటనే బకాయిలు చెల్లించి కార్పొరేట్ వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.