ASF: ఆసిఫాబాద్కి చెందిన మైనర్ బాలికను అపహరించి, అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన నిందితుడు సాయి చరణ్ రెడ్డికి 35 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించారు. ఈ మేరకు జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ఈ సందర్భంగా బాధితురాలికి న్యాయం జరిగేలా కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.