NDL: ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆలయ ముఖద్వారం మండపంలో కొలువు ఉంచి పంచామృతాలతో అభిషేకించారు. పసుపు, చందనం వంటి లేపనాలు సమర్పించి ధూప దీపాలతో మహా మంగళహారతి అందించారు.