MBNR: రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా మద్యం అమ్మకాలపై నిఘా పెట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని బెల్ట్ షాపులను మూసివేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.