MBNR: రూరల్ మండలం కోడూరు గ్రామంలోని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ను సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా ప్రతి అధికారి చొరవ తీసుకోవాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. ఓటర్లకు మౌలిక వసతుల కల్పనలో లోటు ఉండకూడదన్నారు.