ATP: ఆత్మకూరు మండల కేంద్రంలోని పీఎంసీ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేటీఎం 3.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను తిలకించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని వారికి సూచించారు.