KMM: సింగరేణి మండలం టేకులగూడెం గ్రామపంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గుమ్మడి సందీప్‌కు పోటీగా ఇతరులెవరూ నామినేషన్ వేయకపోవడంతో సర్పంచ్ స్థానంతో పాటు 8 వార్డు స్థానాలు సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సంబరాలు జరుపుకున్నారు.