HYD: బతుకమ్మకుంట కేసు విచారణలో భాగంగా, కోర్టు ధిక్కరణ పిటిషన్పై హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన న్యాయమూర్తికి క్షమాపణ చెప్పారు. సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి హైడ్రాపై ఈ పిటిషన్ను దాఖలు చేశారు. కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరై క్షమాపణ చెప్పడంతో కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నారు.