భారత్ ఆతిథ్యం సంతోషాన్ని ఇచ్చిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. అనేక అంశాల్లో ఇరుదేశాల మధ్య అవగాహన కుదిరినట్లు చెప్పారు. ‘విభిన్న అంశాలపై ఇరు దేశాలు తమ అభిప్రాయాలు పంచుకున్నాయి. భారత్-రష్యా మధ్య 64 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ మరింతగా పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని వెల్లడించారు.