HYD: స్థానిక సంస్థల ఎన్నికలను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ బీసీ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మబలిదానం చేసుకున్న సాయి ఈశ్వర్ మృతిపట్ల నిరసనగా జేఏసీ ఛైర్మన్ వేముల రామకృష్ణ ఆందోళనకు దిగారు. రిజర్వేషన్ల కోసం ఇంకెంతమంది బలిదానాలు చేయాలని ప్రశ్నించారు. ఈశ్వర్ కుటుంబానికి రూ. 2కోట్లు నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలి అని డిమాండ్ చేశారు.