భారత్-రష్యా మధ్య స్వేచ్ఛా వాణిజ్య జోన్‌ను ఏర్పాటు చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. భారత ఇంధన రంగ అభివృద్ధికి కావాల్సిన చమురు, గ్యాస్, బొగ్గు అంశాల్లో సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆర్థిక, భద్రత తదితర కీలక అంశాలపై ఒప్పందాలకు చర్చలు జరుపుతామని అన్నారు. తనకు అపూర్వ స్వాగతం పలికిన భారతీయులకు, ప్రధానికి పుతిన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.