రంగారెడ్డి జిల్లా పరిధిలోని 11 మున్సిపాల్టీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. ఎక్కువ మంది నగరంలో ఉండి శివారు ప్రాంతాల్లో పనిచేస్తుండగా, కొంగరకలాన్ కలెక్టరేట్లోనే 600 మందికిపైగా ఉన్నారు. విలీనంతో సంబంధిత మున్సిపాల్టీ ఉద్యోగులకు కూడా జీహెచ్ఎంసీ మాదిరిగానే HRA 24%కు పెరిగే అవకాశం ఉంది.